BJP రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. అధిష్ఠానం(High Command) నుంచి పిలుపు రావడంతో ఉన్నట్టుండి హస్తిన బయల్దేరారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ను రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని ప్రకటించాల్సి ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయాల్సి ఉంది. అటు పలు రాష్ట్రాలకు చీఫ్ ల నియామకాలు చేపట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను అర్జంటుగా ఢిల్లీ పిలిపించడం ఆశ్చర్యకరంగా నిలిచింది.