రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినపుడే BRS ప్రభుత్వానికి కొత్త స్కీమ్ లు గుర్తుకు వస్తాయని BJP స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అన్నారు. దళితబంధును BRS బంధుగా మార్చారని.. మద్యం టెండర్ల డబ్బుతో ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.. BJPకి ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు. కమ్యూనిస్టులవి అవకాశవాద రాజకీయాలని.. కాంగ్రెస్, BRS పాలన చూశాం ఇక మాకు ఒక్క అవకాశమిచ్చి చూడండి అంటూ కిషన్ రెడ్డి కోరారు. రైతు రుణమాఫీ అమలులో సర్కారు జాప్యం చేసిందని.. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు డీఫాల్టర్లుగా మారారన్నారు.
చివరకు వరదలతో సర్వస్వం కోల్పోయిన ప్రజల్ని, పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని.. గతేడాది ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.