పదేళ్లలో ఏనాడు సచివాలయాని(Secretariat)కి రాని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. డిసెంబరు 3న ఎన్నికల ఫలితాలు(Elections Results) రాగానే KCR భరతం పడతామన్న ఆయన.. ముఖ్యమంత్రి తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలయిందని, ఆయన కోసమా ఇక్కడి సమాజం కొట్లాడింది అని ప్రశ్నించారు. BRSకు ఓటేస్తే తన పిల్లల కోసమే KCR పనిచేస్తారని, అదే BJPకి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తామని గుర్తు చేశారు.
ఫామ్ హౌజ్ మాత్రం భద్రంగా
కందుకూరులోని వందల ఎకరాలను ఫార్మా కంపెనీలకు అప్పగించారని, అదే KCR ఫాంహౌజ్ ఉన్న ఎర్రవెల్లి వైపు ఎందుకు కంపెనీలకు ల్యాండ్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. అమాయకులైన గిరిజనుల భూములకు తక్కువ రేట్ కు లాక్కున్నారని, కాంగ్రెస్ కు ఓటేస్తే గెలిచినవాళ్లంతా BRSలో చేరుతారని కిషన్ రెడ్డి అన్నారు.