

త్వరలో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జులై 7 తర్వాత ఆమె పర్యటన ఉంటుందన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో 10 రోజులకోసారి పర్యటించాలని కోరామన్నారు. ప్రియాంకతో కోమటిరెడ్డి భేటీ అయి పలు అంశాలు ప్రస్తావించారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే సీట్ల ప్రకటన ఉంటుందన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని చెప్పినట్లు ఎంపీ వివరించారు.