రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు పరస్పర ఛాలెంజ్ విసురుకున్నారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయని BRS నేత చెప్పగా.. మీ పదేళ్ల పాలనలో ఏం చేశారంటూ మంత్రి కౌంటరిచ్చారు. మధ్యలో స్పీకర్ సైతం.. మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లను కూడా ఇవ్వట్లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో అలాగే ఉంటుందని హరీశ్ అనడంతో కాంగ్రెస్ సభ్యులు అడ్డుచెప్పారు. BRS హయాంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే రోడ్లు వేశారని మంత్రి ఎదురుదాడికి దిగారు. రాష్టమంతా తిరిగి చూద్దామా.. ఛాలెంజ్ చేస్తున్నా అని హరీశ్ కు మంత్రి సవాల్ విసిరితే.. తాను రెడీ అని మాజీమంత్రి బదులిచ్చారు. గ్రామీణ రహదారుల్లో టోల్ విధించే ఆలోచనేదీ లేదని మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.