ఫార్మలా ఈ-కార్ రేస్ కేసులో ACB ఇచ్చిన నోటీసులపై కేటీ రామారావు నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి బయల్దేరారు. ఈ నోటీసులకు ఆయన స్పందిస్తారా, లేదా అనేది సంశయంగా మారిన పరిస్థితుల్లో విచారణకు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కోర్టును ఆశ్రయించిన ఆయన.. ప్రస్తుతం లీగల్ ఎక్స్ పర్ట్స్ తో చర్చించారు. BRS నేతలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున బంజారాహిల్స్ లోని ACB కార్యాలయంతోపాటు అటు తెలంగాణ భవన్ వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. KTRను అరెస్టు చేయవద్దని ఇంతకుముందే ఆదేశాలిచ్చిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఆ తీర్పు వచ్చే వరకు ఈ మాజీ మంత్రి విచారణకు హాజరవుతారా అనేది ఈరోజు(సోమవారం) ఉదయం దాకా సందిగ్ధంగా మారింది. కానీ తన న్యాయవాదులతో చర్చించిన అనంతరం ఏసీబీ ఆఫీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.