BRS నేత KTR, డిప్యూటీ CM భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం జరిగింది. 30 శాతం, 20% కమీషన్లంటూ KTR మాట్లాడిన తీరుపై భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మాటల్ని రికార్డుల నుంచి తొలగించారు. వారిద్దరు ఏం మాట్లాడారంటే…
కేటీఆర్….: మంత్రులకు ఓపిక ఉండాలి.. అంత ఉద్రేకం(Exciting) ఎందుకు.. అమలు చేయని పనుల్ని ప్రశ్నిస్తాం.. మేం కూడా ఉద్రేకంగా మాట్లాడగలం.. 30 శాతం కమీషన్లంటూ వాళ్ల MLAలంటున్నారు.. 20% కమీషన్లని సెక్రటేరియట్లో ధర్నాలవుతున్నాయి..’.
భట్టి….: సభ్యతగా, గౌరవంగా KTR మాట్లాడతారని ఊహించా.. డిబేట్ వాస్తవంగా ఉండాలా, అబద్ధాలతోనా.. మీరు సభనే కాదు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. మేం కమీషన్లు తీసుకుంటున్నామా.. రూ.40 వేల కోట్ల పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా, లక్ష కోట్లకు పైగా అప్పులు చేస్తే దాన్ని బాగు చేస్తున్నాం.. మీ పాపాలతో అంతా ఏడుస్తున్నారు.. నేను దీన్ని నిరూపిస్తా.. ఈ కమీషన్ల ఆరోపణల్ని రుజువు చేయకపోతే సభకు క్షమాపణ చెప్పాల్సిందే..’.