సెప్టెంబరు కల్లా హైదరాబాద్ లో వంద శాతం మురుగునీటి శుద్ధి చేపడతామని… కోకాపేటలో STP ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. నార్సింగిలోని ORRపై నిర్మించిన ఇంటర్ చేంజ్ ను అందుబాటులోకి తెచ్చిన ఆయన… కేంద్రం నుంచి సహకారం లేదంటూ విమర్శలు చేశారు. మూసీపై 55 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపడతామన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ లో భాగంగా 14 బ్రిడ్జిలు మంజూరు చేశామని, తొలుత ఐదింటికి ఫౌండేషన్ వేస్తున్నామన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. మెహిదీపట్నం స్కై వాక్ కు భూములివ్వాలని రక్షణ మంత్రిని కలిసి అడిగామని, 120 ఎకరాలు ఇస్తే భూమికి బదులుగా భూమిగా రక్షణ శాఖకు 500 ఎకరాలు ఇస్తామన్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చే లోపే భూముల్ని అప్పగించాలని కోరారు. ఇంత చెప్పినా వినకపోతే ప్రజల వద్దకే వెళ్లి చెప్పుకుంటామని కేటీఆర్ అన్నారు.