తెలంగాణలో IT డెవలప్ మెంట్ మిగతా రాష్ట్రాల కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటానికి మా లీడర్ షిపే కారణమని కేటీఆర్ అన్నారు. భారతదేశంలోని టెక్నాలజీ రంగంలోని ఉద్యోగాల్లో మొత్తం తెలంగాణవేనని అసెంబ్లీలో చెప్పారు. కోకాపేట భూములకు వేల కోట్లు పలికిన విషయాన్ని ఆయన అసెంబ్లీలో గుర్తు చేశారు. స్టేబుల్(Stable) గవర్నమెంట్, ఏబుల్(Able) లీడర్ షిప్ ఉంటేనే ఇవన్నీ సాధ్యమని, కేసీఆర్ దీక్షా దక్షత వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇండియాలో ఉన్నరా, న్యూయార్క్ లో ఉన్నరా అన్నది రజినీకాంత్ కు అర్థమవుతుంది కానీ ఇక్కడున్న వాళ్లకు అర్థం కావడం లేదంటూ విపక్ష MLAలను ఉద్దేశించి KTR అన్నారు. ఈ నిజాల్ని గుర్తించడానికి వాళ్ల కళ్లు తెరుచుకోవడం లేదని, కంటి వెలుగు స్కీమ్ లో ఒకసారి టెస్టులు చేయించుకోవాలని కామెంట్ చేశారు.
27 ఏళ్లలో రూ.56,000 కోట్ల ఎగుమతులుంటే 2014 తర్వాత తమ హయాంలో 2022లో ఒకే ఒక్క ఏడాదిలో రూ.57,707 కోట్ల IT ఎగుమతుల్ని సాధించామని గర్వంగా ప్రకటించారు. మతం మంటలతో రాష్ట్రాలను నాశనం చేస్తున్నారన్న ఆయన.. మొన్న మణిపూర్, ఇప్పుడు గురుగ్రామ్ అంటూ వివరించారు.