ధరణి విషయంలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ధరణి గురించి వ్యతిరేక ప్రచారం చేస్తుండటంపై తామూ ప్రజల్లోనే తేల్చుకుంటామని, నిజానిజాలు వారికే వివరిస్తామన్నారు. కబ్జాలు, భూదందాలు చేసేవాళ్లకే ఈ పథకం నచ్చట్లేదని విమర్శలు చేశారు. ధరణిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని రేవంత్ చెప్పడంపై కేటీఆర్ మండిపడ్డారు. దానివల్ల పేద ప్రజలకు ఎంతటి ఉపయోగాలున్నాయో తాము కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
మోదీని విమర్శించే సాహసం రేవంత్ రెడ్డి ఎప్పుడూ చేయరని కేటీఆర్ అన్నారు. జాతీయ స్థాయి కూటములు అనేవి మాటల్లోనే బాగుంటాయని, చేతల్లో పనికిరావని విమర్శించారు.