ఎనిమిది+ఎనిమిది కలిస్తే 16 కావాలి కానీ గుండుసున్నా అయిందని మాజీ మంత్రి KTR విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-BJPకి చెరో 8 సీట్లిచ్చినా తెలంగాణకు వచ్చింది సున్నానేనని శాసనసభలో విమర్శించారు. ‘కేంద్రం పెట్టిన బడ్జెట్లో తెలంగాణ పదం కూడా లేదు.. కేంద్రం దగా గురించి ప్రజలకు చెబితే బాగుండేది.. కేంద్రం మిథ్య అని NTR అన్న మాటలు అక్షర సత్యాలు.. డబుల్ ఇంజిన్ అని మాట్లాడతారాధ్యక్ష.. అంటే మాకు ఓట్లేస్తేనే నిధులిస్తామని కేంద్ర పెద్దలే చెప్పడం బ్లాక్ మెయిలింగే.. పార్లమెంటు ఎన్నికల్లో మాకు ఒక్క సీటు కూడా రాలేదు.. చాలామంది సంబరపడ్డారు.. 8 కాంగ్రెస్ కు ఇంకో 8 BJPకి వచ్చాయి.. 8+8 నార్మల్ గా అయితే 16.. కానీ బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్నా..’ అని KTR అన్నారు.