MLAలను కొనడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని, ఆయన RSS ఏజంట్ అని మంత్రి KTR విమర్శించారు. రైతులపై చేసిన కామెంట్లను ఉపసంహరించుకుని PCC ప్రెసిడెంట్ క్షమాపణ చెప్పాలని జగిత్యాలలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉండేదని ఎరువులు, విత్తనాలు ఇచ్చే అవకాశమే ఉండేది కాదన్నారు. KCR తొమ్మిదేళ్ల పాలనలో రైతు స్వరాజ్యం వచ్చింది.. మాది మూడు పంటల నినాదమైతే, కాంగ్రెస్ ది 3 గంటల విధానం అంటూ KTR తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ కటిక చీకట్ల పాలన వద్దు’ అంటూ రైతు వేదికల్లో రేపటి నుంచి తీర్మానం చేస్తామన్నారు. ఉచిత కరెంటుపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని, ఇపుడున్నది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని మాట్లాడారు.
రేవంత్ రెడ్డి RSS నుంచి వచ్చిన కార్యకర్త అని, అందుకే ఆయన ఏనాడూ మోదీని విమర్శించలేదని KTR అన్నారు. రైతు బంధును తీసుకువచ్చిన కేసీఆర్ ను నమ్ముతారా లేక కాంగ్రెస్ ను విశ్వసిస్తారా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర రైతులు కూడా మా పాలనను మెచ్చుకుంటున్నారు, గతంలో ఏ చెరువులనైనా నింపిన చరిత్ర కాంగ్రెస్ ఉందా అని కేటీఆర్ అన్నారు.