సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో తన పేరును ప్రస్తావిస్తూ బద్నాం(Blame) చేస్తున్నారంటూ సిరిసిల్ల MLA KTR… రాష్ట్ర మంత్రి కొండా సురేఖతోపాటు పలు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు(Legal Notices) పంపించారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ట్యాపింగ్ విషయం(Issue)లో ఏ మాత్రం సంబంధం లేకపోయినా తన పేరును కుట్రపూరితంగా పదే పదే ప్రస్తావిస్తున్నారంటూ మండిపడ్డారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
వీరికే నోటీసులు…
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కె.కె.మహేందర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆ ముగ్గురూ సమాధానం చెప్పాలని KT రామారావు డిమాండ్ చేశారు. లీకుల్లో నంబర్ వన్ అయిన రేవంత్ రెడ్డే లీకులు ఇస్తున్నారని, ఆరోపణలు చేసిన మంత్రిపై విమర్శలు చేశారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచి ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్నదని గుర్తు చేసిన KTR.. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలన్నారు.