20 నెలల కాలంలో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని BRS నేత KTR అన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరి వీడియోను ‘X’లో పోస్ట్ చేసి కౌంటరిచ్చారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అంటూ కడియం సమాధానమిచ్చారు. దీన్ని ప్రస్తావిస్తూ KTR వ్యంగ్యంగా మాట్లాడారు. బయటకెళ్లిన పిల్లగాణ్ని ఎక్కడికెళ్లావురా అని తల్లిదండ్రులు అడిగితే.. ఎక్కడికెళ్లాల్నో అక్కడికే వెళ్లిన అని జవాబిస్తే దవడ మీద ఒక్కటిస్తరు చూడు.. గీ అతి తెలివితేటలు చూస్తున్నం 20 నెలలుగా.. విచిత్రమైన అనుభవాలు.. అంటూ మాట్లాడారు.