ఆంధ్రప్రదేశ్ లొల్లి హైదరాబాద్ లో ఎందుకు… ఏమన్నా ఉంటే అక్కడే చూసుకోండి అంటూ మంత్రి KTR అన్నారు. లేని పోని పంచాయతీలు మా దగ్గరే ఎందుకు పెడుతున్నారు.. మీకూ మీకూ ఉంటే మీ రాష్ట్రంలోనే తేల్చుకోండి అంటూ గట్టిగా చెప్పారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలు బాగుండాలంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి.. రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ అది.. అందుకే మేము ఎక్కడా మాట్లాడకుండా న్యూట్రల్ గా ఉంటున్నాము.. ఏపీ వాళ్లే కాదు.. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. మేం ప్రభుత్వాన్ని నడుపుతున్నాము.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే జవాబు చెప్పాల్సింది మేమే కదా అని KT రామారావు స్పష్టం చేశారు.
‘జగన్, పవన్, లోకేశ్ అందరూ నాకు ఫ్రెండ్సే.. అందరం కలిసిమెలిన ఉన్న హైదరాబాద్ లో ఈ పంచాయతీలు ఎందుకు.. లోకేశ్ ఫోన్ చేసి అడిగారు.. ర్యాలీలు ఎందుకు తీయనీయట్లేదని.. మీ గొడవ మాకెందుకు.. లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలంటే మీ రాజకీయాలు మాకు అవసరం లేదు’ అని KTR క్లారిటీ ఇచ్చారు.