
చేనేత కార్మికులందరికీ గుర్తింపు కార్డు(Identity Card)లు అందిస్తామని మంత్రి KTR తెలిపారు. నేతన్నకు బీమాను వెంటనే ఇవ్వడంతోపాటు కొత్తగా 16 వేల మగ్గాలు ఇవ్వబోతున్నామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన్నెగూడలో నిర్వహించిన కార్యక్రమంలో KTR పాల్గొన్నారు. రూ.200 కోట్ల వరకు క్యాష్ క్రెడిట్ లిమిట్ అందజేస్తామన్న ఆయన… చేనేత హెల్త్ కార్డులు ఇస్తున్నామన్నారు. టెస్కాబ్, DCCBల ద్వారా ఈ క్యాష్ క్రెడిట్ సదుపాయాన్ని కల్పించి చేనేత సంఘాల నుంచి కొనుగోళ్లు పెంచి డబ్బులు వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నేత కార్మికులకు గృహలక్ష్మీతోపాటు ఇంటికే అటాచ్డ్ గా ఉండేందుకు షెడ్డు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.