గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma)తో ప్రభుత్వం.. శాసనసభలో అబద్ధాలు చెప్పించిందని BRS నేత KTR విమర్శించారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం రేవంత్ రెడ్డి ఘనత అని చెప్పడం విడ్డూరమన్నారు. రూ.1.62 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్క పథకాన్నీ ప్రారంభించని సర్కారు ఇదేనని విమర్శలు చేశారు. గాంధీభవన్లో కాంగ్రెస్ వాళ్లు చేసిన ప్రసంగంలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు.