ఏ ఫామ్ హౌజ్ తనకు లేదని, తన ఫ్రెండ్ నుంచి లీజుకు తీసుకున్న మాట వాస్తవమని మాజీ మంత్రి KTR అన్నారు. FTL పరిధిలో ఉందని నిరూపిస్తే కూల్చేయడానికి నేనే ముందుకు వస్తానని, తన పేరుతో ఎలాంటి ప్రాపర్టీ లేదని మాట్లాడారు.
జన్వాడ ఫామ్ హౌజ్(Farm House)ను కూల్చివేయొద్దంటూ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగిన వేళ.. KTR స్పందించారు. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చివేసేముందు కాంగ్రెస్ నేతలు పొంగులేటి, వివేక్, కేవీపీ రామచందర్రావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ ప్రాపర్టీలు ఎక్కడున్నాయో చూపిస్తానన్నారు.