రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద రెండు MLCలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫారసు చేశారు. BCలకు చెందిన దాసోజు శ్రవణ్ ను, ఎస్టీల్లో అల్ప సంఖ్యాక వర్గంగా భావిస్తున్న ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను సిఫారసు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చిన విధంగా బడుగు వర్గాలకు చెందిన ఈ ఇద్దర్నీ కేబినెట్ ఎంపిక చేసిందని గుర్తుచేశారు. వీరిద్దర్నీ గవర్నర్ నియమించక తప్పదన్నారు.