మీడియా చిట్ చాట్ల పేరుతో రేవంత్ రెడ్డి అన్ని స్థాయిల్ని మించిపోయారని KTR అన్నారు. ‘రేవంత్.. నేరుగా అడుగుతున్నా.. నాపై డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తు జరుగుతోందన్న ప్రకటనకు ఆధారముందా.. చిన్న రుజువైనా ఉందా.. ఆ ఆధారాల్ని బయటపెట్టాలి, లేదా నిరాధారామైనవని ఒప్పుకోవాలి.. నాపై చిట్ చాట్ల కోసం ఢిల్లీ వరకు వెళ్తారు.. నా ముందు ఫేస్ టూ ఫేస్ నిలబడే ధైర్యం లేదు.. కోర్టులకు లాగుతా రేవంత్ రెడ్డి.. క్షమాపణ చెప్పాలి, లేదా పరిణామాలు ఎదుర్కోవాలి..’ అంటూ KTR ట్వీట్ చేశారు. కేటీఆర్, ఆయన సన్నిహితుడైన సినీ నిర్మాత కేదార్ ఇద్దరూ కలిసి డ్రగ్స్ తీసుకున్నారని, ఆయన మృతిపై దర్యాప్తు జరుగుతోందని అంతకుముందు మీడియా చిట్ చాట్లో రేవంత్ అన్నారు.