
మంత్రి కేటీఆర్ కు అనూహ్య ఘటన ఎదురైంది. ఆయన ప్రచారం చేస్తుండగా వాహనానికి సడెన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగింది. MLA జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి గాను ఆర్మూర్ కు వెళ్లిన కేటీఆర్.. ప్రచార వాహనంపై నుంచి మాట్లాడుతున్నారు. కేటీఆర్ తోపాటు పలువురు నాయకులు దానిపై ఉన్నారు. ఎదురుగా వస్తున్న వెహికిల్ ను తప్పించబోయిన డ్రైవర్.. ఉన్నట్టుండి బ్రేక్ వేశాడు. దీంతో దానిపైన గల రెయిలింగ్ ఊడిపోయి KTRతోపాటు మిగతా అందరూ కింద ముందుకు పడిపోయారు. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలు కాగా.. MP సురేశ్ రెడ్డి మాత్రం పూర్తిగా కింద పడిపోయారు.
ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డి నామినేష్ కోసం KTRతోపాటు నేతలంతా RO కార్యాలయానికి వెళ్లిపోయారు.