పార్టీని ఒక్కరొక్కరే వీడుతున్న(Left) వేళ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ నిన్న అర్థరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మొత్తంగా ఐదుగురు MLAలు BRS చేజారారు. ఇలాంటి పరిస్థితిని గతంలోనూ ఎదుర్కొన్నామని(Faced) ఆయన ‘X’ ద్వారా ట్వీట్ చేశారు.
ఆయన మాటల్లోనే…
‘ప్రజల శక్తి ఎప్పుడూ పవర్ లో ఉన్నవారికంటే బలంగా ఉంటుంది.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-2006 మధ్యకాలంలో కూడా మా పార్టీకి ఇదే పరిస్థితి ఎదురై కప్పదాట్లు జరిగాయి.. కానీ ప్రజాఉద్యమంతో తెలంగాణ గట్టిగా జవాబు చెప్పింది.. కాంగ్రెస్ తలవంచక తప్పలేదు.. అదే పునరావృతం(Repeat) అవుతుంది..’ అంటూ ట్వీట్ చేశారు.