ప్రత్యర్థుల తీరుపై, అధికార పార్టీ నేతలపై రెగ్యులర్ గా ట్వీట్లు పెడుతూ సందడి చేసే మాజీ మంత్రి KT రామారావు.. ఇప్పుడు రాజకీయాలకు భిన్నంగా ట్వీట్ చేశారు. నిత్యం బిజీగా ఉంటూ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ(Encourage) జిల్లాలు చుట్టివస్తున్న ఆయన.. పాలిటిక్స్ కు తాత్కాలిక విరామం ఇవ్వాలనుకుంటున్నట్లు ‘X(పాత ట్విటర్)’లో పోస్ట్ చేశారు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నానని, దీని కారణంగా ప్రత్యర్థులు నన్ను అతిగా మిస్ అవ్వరు కదా అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.