మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావుకు ఇటు వరుసగా ACB నోటీసులు ఇవ్వగా, మరోవైపు విచారణకు రావాలంటూ ED సైతం నోటీసులు పంపింది. ACB విచారణకు న్యాయవాదులతో వచ్చిన ఆయన్ను అధికారులు అడ్డుకుని లాయర్లకు అడ్డుచెప్పారు. దీంతో విచారణకు అటెండ్ కాకుండానే అక్కణ్నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయనకు మరోసారి నోటీసులిచ్చిన ACB అధికారులు.. ఈనెల 9న రావాలని స్పష్టం చేశారు. ఇక ఈరోజు(జనవరి 7)న తమ ఎదుట హాజరుకావాలని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇంతకుముందే ఈ మాజీమంత్రికి పంపిన నోటీసుల్లో తెలిపారు.
ACB కేసు విషయంలో KTR హైకోర్టును ఆశ్రయించగా, ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పును బట్టి ఆయన ACB విచారణకు హాజరవ్వాలా, లేదా అన్నది తేలుతుంది. అటు ఈయన అభ్యర్థన మేరకు ఇవాళ్టి విచారణ నుంచి ED మినహాయింపునిచ్చింది. అయితే ఆయన్ను పిలిచేందుకు మరో నోటీసు ఎప్పుడిస్తారన్నది ED నిర్ణయించాల్సి ఉంది.