Published 02 Dec 2023
ఎన్నికల ఫలితాలు(Results) రేపు రానున్న దృష్ట్యా పార్టీల మెజారిటీ(Majority)ని ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టిన వేళ.. BRS, కాంగ్రెస్ మధ్య రికార్డుల అసలు గొడవ మొదలైంది. కేసీఆర్ సర్కారు పాలనా వ్యవహారాలపై అనుమానంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఏకంగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. రికార్డులు తారుమారు చేస్తున్నారంటూ రెండ్రోజుల నుంచి గుర్రుగా హస్తం పార్టీ లీడర్లు.. ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ల్యాండ్ రికార్డులు మార్చుతున్నారని కంప్లయింట్ లో తెలియజేశారు. అధికారం పోతుందన్న కారణంతోనే కేసీఆర్ గత మూణ్నాలుగు రోజుల నుంచి దీనిపైనే దృష్టిపెట్టారని ఆరోపించారు. వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించి ధరణి పోర్టల్ లో.. ల్యాండ్ రికార్డులు, టైటిల్ రికార్డ్స్ మారుస్తున్నారని తెలియజేశారు.
ఈసీని కలిసింది వీరే
రైతుబంధు కింద చెల్లించాల్సిన నిధులు రూ.6,000 కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు BRS ప్రభుత్వం ఆగమేఘాల మీద కట్టబెడుతున్నదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)కు స్పష్టమైన ఆదేశాలివ్వాలని PCC మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ను కోరారు. PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నేతలంతా వికాస్ రాజ్ ను కలిసి కంప్లయింట్ ఇచ్చారు.