తెలంగాణలో అవినీతికి అంతులేకుండా పోయిందని, దేశంలోనే అత్యంత అవినీతి ఇక్కడే జరుగుతుందని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. విపరీతంగా భూముల స్కామ్ జరుగుతోందని లిక్కర్ స్కామ్ దిల్లీ దాకా పాకిందని అన్నారు. కేసీఆర్ సర్కారు కరప్షన్ పై స్వయంగా ప్రధాని మోదీయే ప్రస్తావించారని, తెలంగాణపై ఆయనకున్న ప్రేమకు ఇది నిదర్శనమని హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రోగ్రాంలో అన్నారు. దళితబంధులో 30 శాతం నిధుల్ని ఎమ్మెల్యే లు కొల్లగొడుతున్నారని… రాబోయే ఎన్నికల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వ సొమ్ముతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తే వాటిలో పాల్గొనేందుకు బయటకు రాని మంత్రులున్నారని గుర్తు చేశారు. BRSకు చెందిన మాజీ మంత్రులు రాజయ్య, కడియం శ్రీహరి పరస్పర ఆరోపణలు చేసుకుంటే… పట్టించుకునే పరిస్థితి ఆ పార్టీలో లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అత్యంత ప్రమాదకరమని మట్లాడారు.