వచ్చే ఎలక్షన్ల కోసం అతి కొద్ది సేపట్లోనే టికెట్ల ప్రకటన వెలువడుతుండగా.. కీలక లీడర్లంతా హైకమాండ్ ఆశీస్సుల కోసం తహతహలాడుతున్నారు. టికెట్ దక్కుతుందో లేదోనన్న టెన్షన్ తో ఉన్న సదరు లీడర్లంతా ముఖ్య నేతల ఇంటికి క్యూ కడుతున్నారు. CM కేసీఆర్, హరీశ్ రావు, కవితను కలిసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. KTR అమెరికా పర్యటనలో ఉండటంతో ఈ ముగ్గురిని కలవాలన్న తాపత్రయంతో అటు ప్రగతి భవన్ కు ఇటు హరీశ్, కవిత ఇళ్ల వద్దకు చేరుకుంటున్నారు. టికెట్ పై అనుమానాలు ఉన్నాయని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న MLAలు కవితను కలిశారు. ఖానాపూర్ MLA రేఖానాయక్ తోపాటు జగిత్యాల MLAలు సంజయ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోపాటు మధుసూదనాచారి కవిత ఇంటికి వెళ్లారు.
మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం MLC కవితతో భేటీ అయ్యారు. ఇక మాజీ మంత్రులు ఎల్.రమణ, సునీతా లక్ష్మారెడ్డి, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తాత మధు మాజీ MLAలు రత్నం, చంద్రావతి తదితరులు కవిత నివాసానికి చేరుకున్నారు.