
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నుంచి నేతల వలస(Migration) కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడగా ఇప్పుడు మాజీ ఎంపీ వివేక్ కటీఫ్ చెప్పారు. కమలం పార్టీని వీడిన ఆయన రాజీనామాను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. కొద్దిసేపట్లో వివేక్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఎట్టకేలకు సొంతగూటికి చేరుకుంటున్న ఆయన.. అగ్రనేత రాహుల్ గాంధీని కలవబోతున్నారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ తోపాటు ఆయన కుమారుడు వంశీ పార్టీలో చేరనున్నారు.
జాతీయ కార్యవర్గ సభ్యుడిగా
BRS నుంచి బయటకు వచ్చిన పెద్దపల్లి మాజీ MP వివేక్.. కమలం పార్టీలో చేరాక కీలకంగా వ్యవహరించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయనకు పార్టీ ప్రముఖ స్థానాన్ని కట్టబెట్టింది.