జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరారు. నిజామాబాద్ MP, ప్రస్తుత కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ జడ్పీటీసీ నానం రాజిరెడ్డి, మల్లాపూర్ మాజీ MPP కోరుట్ల రాములు, ఇబ్రహీంపట్నం మాజీ MPP తేలు లక్ష్మీ ముత్తన్నతోపాటు సాయన్న సహా పలువురు నాయకులు BJP కండువా కప్పుకున్నారు.
అర్వింద్ ప్రచారం
కోరుట్ల అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అర్వింద్ బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కలిసివచ్చే వారిని పార్టీలో చేర్చుకుంటూ ప్రచారం చేస్తున్నారు.