హైదరాబాద్ MP, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Owaisi) పార్లమెంటులో చేసిన ప్రమాణం(Oath) సందర్భంగా జై పాలస్తీనా నినాదం చేయడం వివాదానికి దారితీసింది. రెండోరోజైన మంగళవారం నాడు MPలంతా ప్రమాణం చేశారు. జైహింద్, జై తెలంగాణ అంటూ కొందరు ప్రస్తావించగా, ఈటల రాజేందర్ ఈ రెండింటితోపాటు జై సమ్మక్క-సారలమ్మ అని చెప్పారు.
ఆయన మాత్రం…
ఒవైసీ మాత్రం ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా, తక్బీర్ అల్లాహు అక్బర్’ అంటూ నినదించారు. ఈ పాలస్తీనా నినాదం సభలో కలకలం రేపింది. కేంద్ర మంత్రులు, BJP ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్యానెల్ స్పీకర్ రాధామోహన్ సింగ్ వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఒవైసీ వివరణ…
‘ప్రమాణం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్లోగన్ ఇచ్చారు.. నేను కేవలం జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని చెప్పా.. అది తప్పా.. తప్పని రాజ్యాంగం(Constitution)లో ఉందా చూపించండి.. పాలస్తీనా గురించి మహాత్మాగాంధీ ఏం చెప్పారో చదువుకోండి..’ అంటూ మీడియాతో అన్నారు.