రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు బకాయిల్ని(Pending Bills) వచ్చే మార్చిలోపు చెల్లిస్తామని BC సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గాంధీభవన్లో చిట్ చాట్ లో ప్రస్తావించిన మంత్రి.. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులపై సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రెచ్చగొడుతున్న రాజకీయ పార్టీల మాయలో పడొద్దని సలహా ఇచ్చారు.
2019 నుంచి 2024 వరకు బాకీ పడ్డ బిల్లులు చెల్లించడం లేదంటూ మాజీ సర్పంచుల JAC.. CMను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబరులో ఎన్నికలు వస్తుండగా.. మాజీ సర్పంచుల అరెస్టు వివాదాస్పదం కావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.