వెంకట్ రెడ్డి అంటే ఏంటో రేపట్నుంచి చూపిస్తా.. KCR, KTR జైలుకు పోవడం ఖాయం అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. KCR కుటుంబ దగా వల్లనే ఆయన కూతురు కవిత బలైందని విమర్శించారు. ఎన్నికల కోడ్ వల్ల రైతు బంధు, రుణమాఫీ ఇవ్వలేకపోయాయని, కోడ్ ముగిశాక ఇస్తామని మంత్రి నల్గొండలో అన్నారు.
దుకాణం బంద్…
‘సవాల్(Challenge) చేస్తున్నా.. BRSకు ఒక్క సీటూ రాదు.. ఆ పార్టీకి సింగిల్ సీటు వస్తే దేనికైనా సిద్ధం.. దమ్ముంటే కాంగ్రెస్ ను, మమ్మల్ని టచ్ చేసి చూడండి.. గులాబీ పార్టీని పునాదులతో సహా లేపేస్తాం.. వచ్చే మూడు నెలల్లో ముగ్గురు MLAలు మాత్రమే ఆ పార్టీకి మిగులుతారు.. కాంగ్రెస్-BJP మధ్యే పోటీ.. మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు జైలుకు పోవడం ఖాయం.. వాళ్లిద్దరికీ చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం..’ అంటూ కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యేలను కొనాలని BRS లీడర్లు చూస్తున్నారని, దమ్ముంటే మా పార్టీ నేతలను ముట్టుకుని చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, జగన్ కుట్రల వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న మంత్రి.. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 12 నుంచి 13 సీట్లు వస్తాయన్నారు. ‘కవిత జైలుకు పోవడం వల్ల మెంటల్ లేచింది.. రెండేళ్ల దాకా బెయిల్ రాదు.. వాళ్లు కూడా భయపడుతున్నారు జైలుకు పోతమని.. ఆ పార్టీకి ఎవరన్నా ఓటెస్తారా.. మూణ్నెల్లలో BRS పార్టీ దుకాణం బంద్ అయితది..’ అంటా కౌంటరిచ్చారు.