సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. IAS, IPS లాంటి పోస్టుల్లో రిజర్వేషన్లు అవసరమా అన్న ట్వీట్ వివాదంగా మారింది. దివ్యాంగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు ఆమెపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో(NHRC) ఫిర్యాదు నమోదైంది.
కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ NHRCకి కంప్లయింట్ చేస్తే ఇప్పుడు మంత్రి సీతక్క స్పందించారు. స్మిత సబర్వాల్ కామెంట్స్ వెనుక వేరే ఆలోచన ఉన్నట్లు కనపడుతుందన్నారు.
ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడు ఇచ్చేది.. ఆమె ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించేవాళ్లకే మానసిక వైకల్యం ఉంటుంది.. ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లే ఉంటుంది.. నేను CMకు తెలియజేస్తా.. అంటూ CLP కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.
అటు తనకు సవాల్ విసిరిన మాజీ అధికారి బాలలతకు రివర్స్ కౌంటరిచ్చారు స్మిత. తనతో UPSC పరీక్షలు రాయగలవా అంటూ విసిరిన ఛాలెంజ్ కు.. పరీక్ష రాసే వయసు దాటిపోయిందంటూ ట్వీట్ చేశారు.