రైతు భరోసా(Raithu Bharosa) విధివిధానాలపై చర్చ సందర్భంగా శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి కేటీ రామారావు మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ నడిచింది. తమ పదేళ్ల కాలంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, ఊరూరా నీళ్లు, కరెంటిచ్చామని KTR మాట్లాడారు. దీంతో కోమటిరెడ్డి.. ‘ఏ ఊర్లో భగీరథ నీళ్లిచ్చారో చూద్దాం పద… ఏమియ్యలేరు అధ్యక్షా.. వందేళ్లు వెనక్కు తీసుకెళ్లిండ్రు.. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు కూలిపోతాయని వెదిరె శ్రీరాం అన్నారు.. ఇంటింటికి నీళ్లియ్యకపోతే ఓట్లడగం అన్నారు.. పోదాం పా సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ.. ఒక ఊరికి పోయి నల్లా విప్పుదాం.. నీళ్లొచ్చినాయంటే మళ్లోసారి మేం ఓట్లడగం.. మిషన్ భగీరథలో రూ.50 వేల కోట్లు తినేసిండ్రు.. తినుడు, తినుడు తప్ప అన్నీ తినీ తినీ గొప్పలు చెబుతుండ్రు.. నేను కేటీఆర్ కు సమాధానం చెబుతున్నా, హరీశ్ రావుకు నేను జవాబు చెప్పట్లేదు.. ఆయనకు మాట్లాడే హక్కు లేదు.. ఆయన డిప్యూటీ లీడర్ కాదు.. ఆయన ఒక MLA..’ అంటూ మంత్రి ఆగ్రహంగా మాట్లాడారు.