BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కౌశిక్ రెడ్డి సవాలు(Challenge)తో ఆగ్రహించిన గాంధీ.. అనుచరులతో ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్ పదవిని గాంధీ కట్టబెడుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. BRSకు రాజీనామా చేసి దమ్ముంటే తిరిగి గెలవాలంటూ కౌశిక్ సవాల్ చేశారు.
అలా చేయకపోతే నీ ఇంటికి వస్తానంటూ వార్నింగ్ ఇవ్వడంతో.. గాంధీ దీటుగా స్పందించారు. నువ్వు వచ్చేదేంది.. నేనే నీ ఇంటికి వస్తానంటూ భారీ బలగంతో హుజూరాబాద్ MLA ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ పెద్ద గొడవ చోటుచేసుకుని కోడిగుడ్లు, టమాటలు, రాళ్లతో దాడి చేసుకునేదాకా వెళ్లింది. ఈ గొడవలో కౌశిక్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో శేరిలింగంపల్లి MLA గాంధీని పోలీసులు అరెస్టు చేయడంతో సమస్య సద్దుమణిగింది.