రాష్ట్రంలో మూడు MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ స్థానాలైన వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ తోపాటు పట్టభద్ర స్థానమైన మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ MLC స్థానానికి ఈ రోజు నుంచే నామినేషన్లు తీసుకుంటున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తుండగా, 11న స్క్రూటినీ ఉంటుంది. ఈనెల 27 పోలింగ్.. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 కొత్త జిల్లాలున్నాయి. 191 మండలాల్లో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు గాను APలో తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం టీచర్ MLC స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఆరు స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.