
పట్టభద్రుల(Graduate) కన్నా ఉపాధ్యాయ MLCలకే భారీగా పోలింగ్ నమోదైంది. టీచర్లు పోటాపోటీగా తరలిరావడంతో ప్రతి జిల్లాలోనూ పెద్దయెత్తున ఓట్లు పడ్డాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి 70.42 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఇదే నియోజకవర్గ టీచర్ స్థానానికైతే రికార్డు స్థాయిలో 91.90 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 15 జిల్లాలకు గాను మెదక్ జిల్లాలో 95.03% మంది టీచర్లు ఓటేసి మొదటి స్థానంలో నిలిచారు. 94.83%తో సిద్దిపేట, 94.63%తో రాజన్న సిరిసిల్ల జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రాడ్యుయేట్లకు సంబంధించి 79.50%తో జయశంకర్ భూపాలపల్లి ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ స్థానానికి పోలింగ్ ఇలా…
| జిల్లా | గ్రాడ్యుయేట్ల ఓటింగ్ శాతం | టీచర్ల పోలింగ్ శాతం |
| కుమురం భీమ్ ఆసిఫాబాద్ | 74.08 | 90.21 |
| మంచిర్యాల | 67.30 | 91.77 |
| ఆదిలాబాద్ | 69.47 | 92.78 |
| నిర్మల్ | 70.52 | 82.10 |
| నిజామాబాద్ | 77.24 | 92.46 |
| కామారెడ్డి | 78.12 | 93.64 |
| జగిత్యాల | 70.47 | 92.43 |
| పెద్దపల్లి | 68.50 | 94.42 |
| కరీంనగర్ | 64.64 | 89.92 |
| రాజన్న సిరిసిల్ల | 68.73 | 94.63 |
| సంగారెడ్డి | 73.19 | 92.57 |
| మెదక్ | 75.26 | 95.03 |
| సిద్దిపేట | 72.83 | 94.83 |
| హన్మకొండ | 75.14 | 92.77 |
| జయశంకర్ భూపాలపల్లి | 79.50 | 92.77 |