BRS పెద్ద నేత హస్తం వల్లే తనపై నల్గొండ నాయకుడు విమర్శలు చేశారని MLC కవిత అన్నారు. ‘కుట్రలు చేసిన పెద్దనాయకులు నా నుంచి సమాచారం తీసుకున్నామని అనుకుంటున్నారు.. చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.. అక్కడేం జరుగుతుందో నాకు సమాచారముంది.. మీరు ఎవర్ని ప్రోత్సహించి మాట్లాడిస్తున్నరో నేను గమనిస్తున్నా.. ఏ టైంలో ఎవర్ని కలిశారు.. ఎంత కిందస్థాయికి దిగజారి నాపై మాట్లాడించారు.. నన్ను ఒంటరి చేసి శునకానందం పొందొచ్చు.. నల్గొండలో పార్టీని నాశనం చేసిన లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు, ఈమెవరంటూ మాట్లాడుతున్నారంటే ప్రోత్సహిస్తున్నదెవరో తెలుసుకోవచ్చు.. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా చివరి నిమిషంలో గెలిచిన వ్యక్తి నన్ను అంటుండు..’ అని ఆరోపించారు.