ప్రధాని మోదీ మరో రికార్డు సాధించారు. అత్యధిక రోజుల రెండో ప్రధానిగా నిలిచారు. 2025 జులై 25కి 4,078 రోజులు పూర్తి చేసుకుని, 4,077 రోజుల ఇందిర రికార్డును అధిగమించారు. మోదీ కన్నా ముందు 6,130 రోజులతో నెహ్రూ ఉన్నారు. రెండుసార్లు పూర్తికాలం సహా మూడోసారి గెలిచిన కాంగ్రెసేతర ప్రధానిగానూ మోదీది రికార్డే. 1971లో ఇందిర తర్వాత ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఘనతా ఆయనదే. నెహ్రూ తర్వాత ఒక పార్టీ అధినేతగా మూడుసార్లు గెలవడమూ చరిత్రే. ఇక దేశ చరిత్రలో PM, CMలకు సాధ్యం కాలేని లెక్కలూ సొంతమయ్యాయి. గుజరాత్ లో 2002, 2007, 2012లో వరుసగా… లోక్ సభకు 2014, 2019, 2024.. ఇలా వరుసగా ఆరు ఎన్నికల్లో గెలుపొందారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా 24 ఏళ్లపాటు నిరంతరాయంగా సాగుతున్న నేతగా ప్రాచుర్యం పొందారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com