
కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, గడచిన తొమ్మిదేళ్లుగా BRS మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. జనాల నమ్మకాన్ని BRS తునాతునకలు చేసేసిందని, కుటుంబాన్ని పెంచి పోషించుకోవడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. BRS సర్కారు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని, వాళ్ల కరప్షన్ దిల్లీ దాకా పాకిందని వివరించారు. కాంగ్రెస్ అవినీతి దేశమంతా తెలుసని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు.
స్కాంల నుంచి డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ కొత్త డ్రామాలు స్టార్ట్ చేస్తున్నారని, తెలంగాణ ప్రజానీకం ఒక కుటుంబం కంబంధ హస్తాల్లో చిక్కుకుందని ప్రధాని విమర్శించారు. వారసత్వ పార్టీలంటేనే అవినీతిమయమని, తెలంగాణ నుంచి ఆ రెండు పార్టీలను తరిమివేయాలని పిలుపునిచ్చారు.