
కుటుంబం బాగుపడితే చాలని వారికి దేశం గురించి అవసరం లేదని విపక్షాలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఫ్యామిలీ ఫస్ట్.. నేషన్ నథింగ్’ అని విపక్ష కూటమిని ఉద్దేశిస్తూ అన్నారు. పోర్ట్ బ్లెయిర్ లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కొత్తగా నిర్మించిన టెర్మినల్ భవన ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా విపక్ష కూటమి తీరును ఎండగట్టారు. ‘బెంగళూరు మీటింగ్ ద్వారా అన్ని పార్టీలు కలిపి రూ.20 లక్షల కోట్ల స్కామ్ గ్యారంటీ’ అని.. ప్రజలు కూడా అదే విధమైన భావనతో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. 2024లో తమకు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారని మోదీ వివరించారు.
‘వాళ్లకు కావాల్సింది కుటుంబం.. కుటుంబం.. కుటుంబం.. కరప్షన్ తో వేల కోట్లు సంపాదించి రాచరిక పాలన అనుభవించాలి.. దేశం గురించి వాళ్లకు ఏ మాత్రం అవసరం లేదు’ అని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.