ప్రధాని అయ్యేందుకు ఆనాడు ఎల్.బి.స్టేడియం తనను ఆశీర్వదించిందని ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రికి ఇదే స్టేడియం వేదిక అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందంటూ ఈ మూడు పదాలను తెలుగులో ప్రస్తావించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో మాట్లాడిన మోదీ.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, సమ్మక్క-సారలమ్మను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు BJPపై విశ్వాసంతో ఉన్నారని.. BC, SC, ST విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు.
BRS ఓటమి ఖాయం
BRS ఓటమి ఖాయమని.. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాల్లో BRS, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఒకటేనని మోదీ అన్నారు. అబ్దుల్ కలామ్, రామ్ నాథ్ కోవింద్, ద్రౌపదీ ముర్ములను రాష్ట్రపతులుగా.. బాలయోగి, పీఏ సంగ్మాలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టింది కమలం పార్టీ అని గుర్తు చేశారు.