ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని… దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర అమోఘమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కావచ్చు కానీ దాని పాత్ర గొప్పదని, రాష్ట్రంలో కనెక్టివిటీ, మాన్యూఫాక్చర్ కోసం రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాజీపేట్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన తర్వాత.. హన్మకొండ విజయ సంకల్ప సభలో PM ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యంత బలవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 5వ స్థానంలో ఉందని.. హైవేలు, ఎకానమిక్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ తో తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 1.10 లక్షల కోట్లతో జాతీయ రహదారులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం 2024 నాటికి 2 లక్షల కోట్లు వెచ్చించేందుకు సిద్ధమని తెలిపారు.