దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదని, గుజరాతీ బిడ్డ కృషి కారణంగానే అది దక్కిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం విలీనమైందని, ఈ రోజు మరో గుజరాతీ బిడ్డ(మోదీ)తో తెలంగాణకు ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీలో నిర్వహించిన ఇందూరు ప్రజాగర్జన సభకు ఆయన హాజరయ్యారు. కుటుంబ పాలనకు తెలంగాణ యువత మరో అవకాశం ఇవ్వొద్దని, NTPC ఓపెనింగ్ ద్వారా మరో 4,000 మెగావాట్ల పవర్ అందుబాటులోకి వస్తుందన్నారు. GHMC ఎన్నికల తర్వాత NDAలో చేరతామంటూ కేసీఆర్ తనను కలిశారని, కానీ ఆ ఎలక్షన్ల తర్వాత తాము గట్టిగా పోరాడాలనే నిర్ణయించుకున్నామని తెలిపారు.
రాజరికం కాదని చెప్పా
‘ఇప్పటివరకు మీకు చెప్పని ఓ రహస్యం బయటపెడుతున్నా.. కేసీఆర్ నన్ను కలిసినప్పుడు జరిగిన సంఘటన గురించి చెబుతున్నా’ అంటూ మోదీ మాట్లాడారు. GHMC ఎలక్షన్ల తర్వాత KTRను ఆశీర్వదించాలని కోరిన కేసీఆర్ తో.. ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యమని చెప్పినట్లు ప్రధాని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు కనిపించిందన్నారు. సభా వేదిక నుంచే రూ.8,000 కోట్ల విలువైన పనుల్ని ఆయన ప్రారంభించారు. సిద్దిపేట-మనోహరాబాద్ రైల్వే లైన్ ను మోదీ జెండా ఊపి స్టార్ట్ చేశారు. NTPC సూపర్ పవర్ థర్మల్ స్టేషన్ ను ప్రారంభించారు.