మహిళా రిజర్వేషన్ బిల్లు పవిత్ర కార్యం లాంటిదని.. దాన్ని అమలు చేసేందుకే దేవుడు నన్న పంపాడు అంటూ ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు కొత్త భవనంలో మాట్లాడిన ప్రధాని… మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రసంగంలో ఉదహరించారు. గతంలో ఎన్నో సార్లు బిల్లు ఉభయసభలకు వచ్చినా అది నెరవేరలేదని గుర్తు చేశారు. కానీ ఈ చట్టం చేసేందుకు మేం సంకల్పం తీసుకున్నామని.. ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయాల్సిన అవసరముందన్నారు.
ఈ రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చితే దేశంలోని మహిళల శక్తి పెరుగుతుందన్న ప్రధాని… పార్లమెంటు కొత్త భవనంలో ఆమోదించే ఫస్ట్ బిల్లు ఇదే అవుతుందని స్పష్టం చేశారు.
Superb