
ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో ఉన్నారు. ప్రధాన సమాచార కమిషనర్(CIC) ఎంపిక కోసం ముగ్గురూ భేటీ అయ్యారు. కేంద్ర సమాచార కమిషన్ లో ప్రస్తుతం ఇద్దరు కమిషనర్లే ఉండగా, ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2023 నవంబరు 6న CICగా బాధ్యతలు చేపట్టిన హీరాలాల్ సమారియా 65 ఏళ్ల వయసు పూర్తి కాగానే ఈ సెప్టెంబరు 13న రిటైరయ్యారు. RTI చట్టం ప్రకారం CICతోపాటు కమిషనర్లను ప్రధాని అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందుకోసం శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(DoPT) ప్రకటన ఇచ్చింది. ప్రధాన సమాచార కమిషనర్ పదవికి 83, మిగతాయ పోస్టులకు 161 దరఖాస్తులు వచ్చాయి.