కేంద్ర ప్రభుత్వ పథకాల(Schemes)ను BJP పాలిత రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని, వాటిని యథావిధిగా 100 శాతం అమలు చేయాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏదైనా పథకాన్ని తీసుకొచ్చామంటే దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి అది ప్రజలపై చూపే ప్రభావాన్ని(Effectness) పరిగణలోకి తీసుకున్న తర్వాతే అమలు చేస్తుంటామన్నారు.
స్కీమ్ లను అమలు చేయడంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకోవద్దని ఆయా రాష్ట్రాల CMలు, ఉప ముఖ్యమంత్రులతో జరిగిన భేటీలో మోదీ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. అర్హులైన వారికి చేరేలా చూడటంతోపాటు అవి పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.