ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఓకే అయింది. అక్టోబరు 1న ఆయన మహబూబ్ నగర్ చేరుకుని.. భూత్పూర్ లో నిర్వహించే BJP సమరభేరి బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని.. అక్కడి పరిసర ప్రాంతాల్లో అర గంటపాటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హెలికాప్టర్ లో మహబూబ్ నగర్(Mahabubnagar) బయలుదేరి వెళ్తారు. 3:15 గంటల నుంచి 4:15 వరకు భూత్పూర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
వాస్తవానికి అక్టోబరు 2న ప్రధాని రాష్ట్రానికి వస్తారని ప్రచారం జరిగింది. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటిస్తారని భావించారు. కానీ అంతకు ఒకరోజు ముందుగానే మోదీ రాష్ట్రానికి వస్తున్నారు.