
అసెంబ్లీ టికెట్ల ప్రకటనకు ముందు అధికార పార్టీలో అగ్గి రాజుకుంటోంది. తమకు ఎలాగూ సీటు దక్కదని తెలిసిన లీడర్లు… ఇక హైకమాండ్ పై తిరుగుబాటుకు దిగుతున్నారు. తనకు, తన కుమారుడికి ఇద్దరికీ టికెట్లివ్వకపోతే ఇండిపెండెంట్(Independent) గా రంగంలోకి దిగుతామని మల్కాజిగిరి MLA మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన.. హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హరీశ్ అంతు చూస్తానని, సంగతి తేలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తన కొడుకు డాక్టర్ గా ఎంతో సమాజ సేవ చేశారని, కొవిడ్ టైమ్ లో రూ.8 కోట్లు ఖర్చు పెట్టారన్న మైనంపల్లి.. రబ్బరు చెప్పులతో తిరిగిన హరీశ్ రావు ఇప్పడేదో డామినేషన్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
మెదక్ జిల్లా యంత్రాంగాన్నంతా సిద్ధిపేటకు తరలించారని, అయినా తాను మళ్లీ మెదక్ ను సిద్ధిపేటలాగా మారుస్తానన్నారు. వచ్చే ఎలక్షన్లలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానన్న ఆయన.. తన కుమారుడి విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే ఉండదన్నారు.