
విపక్ష కూటములన్నీ ఒక్కటవుతున్న(united) వేళ అధికార BJP సైతం NDA కూటమి మీటింగ్ పెడుతోంది. రేపు(జులై 18న) ఈ మీటింగ్ జరగనుంది. ఓల్డ్ ఫ్రెండ్స్ ను తిరిగి రప్పించి కూటమిని బలోపేతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని పార్టీల చీఫ్ లకు JP నడ్డా లెటర్స్ రాశారు. ప్రధాని మోదీ అటెండ్ కానున్న ఈ మీటింగ్ ద్వారా వచ్చే ఎలక్షన్ల(elections)లో అనుసరించే వ్యూహాల గురించి ఇందులో చర్చించనున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కూటమి ఐక్యతను చాటాలన్న భావనను BJP టార్గెట్ గా పెట్టుకుంది.
దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతుండటం, 26 విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం నిర్వహిస్తుండటంతో తాము కూడా బలాన్ని చాటాలన్న లక్ష్యంతో కమలం పార్టీ పావులు కదుపుతోంది. NDAను వీడి వెళ్లిన పార్టీలను తిరిగి రప్పించేందుకు ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్లు పంపించింది. తూర్పు ఉత్తర్ ప్రదేశ్ OBCల్లో గట్టి పట్టున్న లీడర్ గా గుర్తింపు పొందిన SBSP చీఫ్ ఓంప్రకాశ్ రాజ్ భర్ తిరిగి NDA గూటికి చేరారు. ఈయన రాకతో UPలో పార్టీ మరింత బలపడినట్లు అయిందని కమలం పార్టీ లీడర్లు అంటున్నారు. 2022 అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు రాజ్ భర్.. యోగి కేబినెట్ నుంచి తప్పుకున్నారు. సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీకి దిగారు.